మా హయంలో విద్యార్థులు ఎవరెస్ట్ ఎక్కితే.. కాంగ్రెస్ హయాంలో రోడ్లెక్కుతున్నారు : మాజీ మంత్రి హాట్ కామెంట్స్

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి విమర్శించారు.

మా హయంలో విద్యార్థులు ఎవరెస్ట్ ఎక్కితే.. కాంగ్రెస్ హయాంలో రోడ్లెక్కుతున్నారు : మాజీ మంత్రి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి విమర్శించారు. నాడు కేసీఆర్ పాలనలో గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కితే, నేడు ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తమ సమస్యల పరిష్కారం కోసం గురుకుల పాఠశాలల విద్యార్థులు రోడ్లెక్కుతున్నారని మండిపడ్డారు. గద్వాల జిల్లా అలంపూర్ మండలం పుల్లూరు గ్రామంలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో తాగునీరు రాక ఉప్పు నీరు తాగుతున్నామని, పురుగుల అన్నం తింటున్నామని, మరుగుదొడ్లు సరిగ్గా లేక బహిర్భూమికి పంట పొలాల్లోకి వెళ్తున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరడం కాంగ్రెస్ పాలన వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

సమస్యల పరిష్కారం కోసం బడిపిల్లల పాదయాత్రను కూడా బెదిరించి విద్యార్థులను డీసీఎంలో ఎక్కించి వెనక్కి తీసుకెళ్లడం కాంగ్రెస్ సర్కార్ నిర్భంధానికి ఉదాహరణ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో గురుకుల విద్యార్థులు 150 మంది కలుషిత ఆహారం తిని ఆస్పత్రి పాలయిన ఘటన మరవక ముందే పుల్లూరు విద్యార్థులు రోడ్డెక్కడం ఈ ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోందని అన్నారు. సంక్షేమ గురుకుల పాఠశాలల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది ఆగ్రహం వ్యక్తం చేసారు. గురుకులాల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

Next Story