- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lucky Baskhar: రేవంత్ రెడ్డి ఒక రాజకీయ లక్కీ భాస్కర్.. మాజీ మంత్రి హాట్ కామెంట్స్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రాజకీయ లక్కీ భాస్కర్ అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి విమర్శలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఒక రాజకీయ లక్కీ భాస్కర్ (Lucky Baskhar) అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన సభలో రాజకీయ విమర్శలా? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నిసార్లు మందలించినా రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవడం లేదన్నారు. అందివచ్చిన అవకాశంలో రేవంత్ రెడ్డి ఓ రాజకీయ లక్కీ భాస్కర్ అని అన్నారు. వెళ్ళిన ప్రతి చోట పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నాడు.. ఆయన మాటలను ఆ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఖండించారని చెప్పారు. కొల్లాపూర్‌లో నిర్వహించిన సభలో 40 నిమిషాల రేవంత్ రెడ్డి ప్రసంగంలో 38 సార్లు కేసీఆర్ నామస్మరణ చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి పాలమూరుకు ఏం చేశాడు? అని ప్రశ్నించారు.
కేసీఆర్ నామస్మరణతో రేవంత్ తన పాపం ప్రక్షాళన చేసుకుంటున్నాడని భావిస్తున్నట్లు తెలిపారు. ఆరె నెలల క్రితం శంకుస్థాపన చేసిన యంగ్ ఇండియా స్కూల్‌కు ఇంతవరకు దిక్కు లేదు. మళ్లీ మరో పాఠశాలకు శంకుస్థాపన చేశారు.. కొత్తగా పాలమూరుకు చేసింది ఏమిటి? ఆది నుంచి తెలంగాణకు ఆగర్భ శత్రువు కాంగ్రెస్ పార్టీ.. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను నిర్మించాల్సిన స్థలాలను మార్చారని ఆరోపించారు. తెలంగాణ విధ్వంసం అయింది, సర్వనాశనం అయింది కాంగ్రెస్ పాలనలోనే.. ఆ తర్వాత టీడీపీ, చంద్రబాబు నాయుడు పాలనలోనే.. ఈ విషయం కాంగ్రెస్ నేతలు శ్రీ కృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారని వివరించారు. మా నాన్న చనిపోతే దినాలకు నీళ్లు లేని దిక్కుమాలిన పాలన కాంగ్రెస్ పార్టీది అని రేవంత్ రెడ్డి స్వయంగా శాసనసభలో చెప్పారని అన్నారు.






