స్టేజీపైనే మాజీ మంత్రి మోత్కుపల్లి కంటతడి

by Prasad Jukanti |

మాదిగ మహాశక్తి పార్టీ జెండాను ఆవిష్కరిస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కంటతడి పెట్టారు.

స్టేజీపైనే మాజీ మంత్రి మోత్కుపల్లి కంటతడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కంటతడి పెట్టారు. ఇవాళ మాదిగ మహాశక్తి పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమోషన్ అయ్యారు. ఇప్పటి వరకు మాదిగలం ఎంతో నష్టపోయామని ఇకనైనా మనమంతా ఏకం కావాలని అన్నారు. ఎవ్వరూ మనపై జాలి చూపడం లేదని, మాదిగలంతా తన వెంట ఉంటే తెలంగాణ రాజకీయం మారిపోతుందన్నారు. ఇప్పటికైనా మనం అందరం ఏకం అవుదామని పిలుపునిచ్చారు. ఇకపై ఎవరూ పార్టీలకు ఓట్లు వేయవద్దని, రాజకీయ పదవులు పొందేలా మన కులానికే ఓట్లు వేయాలని కాళ్లు మొక్కుతూ కోరుతున్నానని ఎమోషన్ అయ్యారు. మాదిగల ఓట్లు మాదిగలకే నినాదంతో ప్రజల్లోకి వెళ్దామని అన్నారు. తనకు 70 ఏళ్లు వచ్చాయని చచ్చేవరకు మన జాతికోసమే బతుకుతామన్నారు.

Next Story