Malla Reddy: రాజకీయమే వద్దనుకుంటున్నా.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2025-08-09 12:07:44  IST  )

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Malla Reddy: రాజకీయమే వద్దనుకుంటున్నా.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సేవ చేసి మంచిగా కాలేజీలు, యూనివర్సిటీలు నడిపించుకుంటూ.. రాజకీయాలకు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు మనసులో మాట బయటపెట్టారు. రాఖీ పండుగ సందర్భంగా ఆయన శనివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయంగా బీజేపీ వైపా, టీడీపీ వైపా, బీఆర్ఎస్ పార్టీల వైపా అన్నది కాదని, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోని ఉన్నానని మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు 73 సంవత్సరాలు వచ్చాయని, ఇంకా ఏ వైపునకు చూడాల్సిన అవసరం ఏముందని చెప్పుకొచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిని అయ్యాను.. ఇంకా మూడేళ్లు (politics) రాజకీయాల్లో ఉంటానని క్లారిటీ ఇచ్చారు. అసలు తను రాజకీయమే వద్దనుకుంటున్నాని తెలిపారు.

Next Story