- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరూపిస్తే రాజీనామా చేస్తా.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఓపెన్ ఛాలెంజ్ చేశారు. శనివారం కేటీఆర్ ఓ ప్రముఖ తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన రెండేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి కొన్ని వేల ఇండ్లు కూలగొట్టాడు కానీ, ఒక్క ఇల్లు అయినా కట్టాడా? అని ప్రశ్నించారు. తాను అధికారంలోకి వచ్చాక ఒక్క ఇల్లు అయినా కట్టానని రేవంత్ నిరూపిస్తే.. నేను రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. అలాగే తన రెండేళ్ల పాలనలోనే రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చానని రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు రూ.19 వేల కోట్ల పెట్టుబడులే వచ్చాయని ప్రభుత్వ వెబ్‌సైట్ తెలిపిందని చెప్పుకొచ్చారు.
ఇక తాము 42 ఫ్లైఓవర్లు కడితే.. రెండేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి 42 గుంతలు కూడా పూడ్చలేదని విమర్శించారు. విచిత్రంగా రోడ్ల కింద బావులు తవ్వానని చెప్తే.. అసలు ఎక్కడ తవ్వారో మేము వెతుకుతున్నామని సెటైర్లు వేశారు. పేదోళ్ల ఇండ్లు కూలగొడుతున్నారే తప్ప.. సీఎం సోదరుడు, కాంగ్రెస్ నేతల జోలికి మాత్రం హైడ్రా వెళ్లట్లేదని తీవ్ర ఆరోపణలు చేశారు.






