- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతిలోపు ‘వర్కర్ టు ఓనర్’ పథకం ప్రారంభించాలి.. మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్
సంక్రాంతిలోపు నేత కార్మికులకు ప్రయోజనం చేకూర్చే ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతిలోపు నేత కార్మికులకు ప్రయోజనం చేకూర్చే ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ సిరిసిల్లలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిరిసిల్లలోని నేత కార్మికులను యజమానులుగా మార్చాలనేది కేసీఆర్ ఆలోచన అని అన్నారు. ప్రస్తుతం ఉన్న 10 మంది కార్మికులు మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్నారు.
సిరిసిల్ల తిరువూరు స్థాయికి ఎదగాలి..
సిరిసిల్లను తమిళనాడులోని తిరుపూర్ మాదిరిగా రూ.వేల కోట్ల రూపాయల వస్త్ర ఉత్పత్తి కేంద్రంగా మార్చాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని సంక్రాంతి పండుగలోపు త్వరగా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేసిందని గుర్తు చేశారు. సిరిసిల్లలో వేలాది మంది నేత కార్మికులు, పవర్‌లూమ్ యజమానులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ‘వర్కర్ టు ఓనర్’ పథకం అమలు చేయడం కీలకమని అన్నారు. గతంలో బతుకమ్మ చీరల పథకం ద్వారా కార్మికులకు ఉపాధి, ఆదాయం కల్పించినట్లే, ఇప్పుడు కూడా కార్మికులను స్వయం యజమానులుగా మార్చే దిశగా ప్రభుత్వం బాధ్యత వహించాలని పేర్కొన్నారు. సిరిసిల్లను తిరుపూర్ స్థాయికి తీసుకెళ్లాలంటే కార్మికులు మరింత ఉత్సాహంగా, స్వాతంత్ర్యంగా పనిచేసే వాతావరణం కావాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, రేవంత్ సర్కార్ త్వరలోనే సానుకూల చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అన్నారు.






