మాజీ క్రికెటర్ మృతి పట్ల మాజీమంత్రి కేటీఆర్ సంతాపం

by Ramesh Goud |

మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ (Former Cricketer sayyad abid ali) మృతి (Death) పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) విచారం వ్యక్తం చేశారు.

మాజీ క్రికెటర్ మృతి పట్ల మాజీమంత్రి కేటీఆర్ సంతాపం
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ (Former Cricketer sayyad abid ali) మృతి (Death) పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ (Twitter) లో అలీ ఫోటోను షేర్ చేస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేటీఆర్.. నిజమైన హైదరాబాదీ క్రికెట్ లెజెండ్ (Real Hyderabad Cricket Lezend) సయ్యద్ అబిద్ అలీ సాబ్ మృతికి హృదయపూర్వక సంతాపం (condoles) తెలియజేశారు. క్రికెట్ పై అభిరుచితో ఆడిన ఆల్ రౌండర్ (Al Roundar) అతడని కొనియాడారు.

అంతేగాక అతను భారత క్రికెట్‌పై (Indian Cricket) శాశ్వతమైన ముద్ర వేశారని చెప్పారు. ఇక ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ.. అబిద్ అలీ ఆత్మకు శాంతి కలగాలని (Rest In Peace) దేవుడిని ప్రార్థించారు. కాగా భారత దిగ్గజ మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ కు చెందిన ఆయన.. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు. 1967 నుంచి 75 మధ్య కాలంలో భారత జట్టుకు సేవలు అందించిన అలీ.. తన కెరీర్ మొత్తంలో 29 టెస్టులు ఆడి, 42.12 సగటుతో 47 వికెట్లు తీశాడు.

Next Story