Jupally Krishna Rao : బ్రేకింగ్: కాంగ్రెస్‌లో చేరికపై మాజీ మంత్రి జూపల్లి క్లారిటీ

by Disha Web Desk 19 |
Jupally Krishna Rao : బ్రేకింగ్: కాంగ్రెస్‌లో చేరికపై మాజీ మంత్రి జూపల్లి క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌లో చేరికపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు క్లారిటీ ఇచ్చారు. ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జూపల్లితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తిరిగి సొంతగూటికి రావాలని జూపల్లిని రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి ఆహ్వానించారు. ఈ భేటీ అనంతరం మాజీమంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆహ్వానించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరికపై త్వరలోనే నిర్ణయం తీసకుంటానని పేర్కొన్నారు. చేరిక విషయంపై మిగతా మిత్రులతో కలిసి చర్చించాల్సి ఉందని.. వారితో చర్చించిన తర్వాత కాంగ్రెస్‌లో చేరికపై నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం అవినీతిలో అభివృద్ధి చెందిదని.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పాతాళానికి వెళ్లిందని మండిపడ్డారు.

Next Story

Most Viewed