- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు KCRతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ.. జాయినింగ్ తేదీపై రానున్న క్లారిటీ
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఇవాళ ఆయన ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో భేటీ కాబోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. నిన్న జగిత్యాల పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయనతో సుదీర్ఘంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలతో పాటు, కాంగ్రెస్‌లో ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించినట్లుగా సమాచారం. ఇక కేటీఆర్‌తో ప్రాథమిక చర్చలు ముగియడంతో, తుది నిర్ణయం కోసం జీవన్ రెడ్డి ఇవాళ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ దళపతి, మాజీ సీఎం కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్టీలో ఆయనకు దక్కే ప్రాధాన్యత, భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత రానుంది. ఈ సమావేశం ముగిసిన వెంటనే ఆయన అఫీషియల్‌గా బీఆర్ఎస్ పార్టీలో చేరే తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
ఈ క్రమంలోనే దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడనుండటం హస్తం పార్టీకి పెద్ద దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాలో తనకంటూ ప్రత్యేక అనుచరగణం ఉన్న జీవన్ రెడ్డి వెళ్తే, అది వచ్చే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.






