నల్లమల పులి కాదు.. పిల్లి: CM రేవంత్‌పై మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నల్లమల పులి కాదు.. పిల్లి: CM రేవంత్‌పై మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం గాజులరామారంలో హైడ్రా(Hydraa) కూలగొట్టిన పేదల ఇండ్ల స్థలాన్ని, పార్టీ మారిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ 11 ఎకరాలను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. హైడ్రా అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు, కేవలం రేవంత్ రెడ్డికి ప్రైవేట్ ఏజెన్సీలా పని చేస్తుంది.. ఒక పక్కన మూసీ ఒడ్డున పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నా.. హైడ్రా ఆ పక్కకు చూడట్లే, కేవలం పేద వాళ్ళ ఇళ్ల మీదనే హైడ్రా ప్రతాపం చూపిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కనిపిస్తే, ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి హైడ్రాతో కూలగొట్టిన పేదోళ్ల ఇండ్ల శిథిలాలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే గాంధీ గాజులరామారంలో 11 ఎకరాలు కబ్జా చేస్తే, అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా పోలీసులతో ఆ ప్రాంతానికి భద్రత కల్పించారని కీలక వ్యాఖ్యలు చేశారు.

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు ఓటు వెయ్యకుంటే పెన్షన్‌లు ఉండవ్, ఫ్రీ బస్ ఉండదు.. రేషన్ ఉండదు.. అని పేద వాళ్ళని సీఎం రేవంత్ రెడ్డి భయపెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు ప్రజల హక్కు.. ఎవరూ ఇంట్లో నుంచి ఇవ్వట్లేదు ఆపడానికి అని సీరియస్ అయ్యారు. తెలంగాణ ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది, రేవంత్ రెడ్డిని తరిమికొట్టే రోజులు చాలా దగ్గర్లోనే ఉన్నాయి.. నల్లమల పులి కాలు.. పోలీసులను అడ్డుపెట్టుకొని తిరుగుతున్న పిల్లి అని సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Next Story