- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jagadish Reddy : నల్గొండలో కాంగ్రెస్ గూండాల రాజ్యం : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
నల్గొండ(Nalgonda) మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(Kancharla Bhupal Reddy)పై దాడి జరిగిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : నల్గొండ(Nalgonda) మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(Kancharla Bhupal Reddy)పై దాడి జరిగిన విషయం తెలిసిందే. మున్సిపల్ కార్యాలయంలో కేటీఆర్ ఫ్లెక్సీలు(KTR Flexy) తొలగించడంతో మొదలైన వివాదం.. చివరకు కాంగ్రెస్-బీఆర్ఎస్(Congress-BRS) శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నారు. కాగా కంచర్ల భూపాల్ రెడ్డిపై దాడిని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) తీవ్రంగా ఖండించారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ గూండాల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. భూపాల్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ రాజ్యాంగం అమలు చేస్తే చూస్తూ ఊరుకోమని, పాలన ఇలాగే కొనసాగితే ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ రహిత తెలంగాణ కోసం నల్గొండ నుంచే ఉద్యమం మొదలు పెడతామని జగదీష్‌రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.






