- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ గూటికి ఇంద్రకరణ్ రెడ్డి..?
by Vemula.Srinu Prasad |
మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్త ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నది....

X
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్త ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నది. గురువారం మాజీ మంత్రి జానారెడ్డిని ఆయన కలవడం మరింత చర్చంశనీయమైంది. కాంగ్రెస్‌లో చేరికపైనే ఇరువురి నేతల మధ్య చర్చలు జరిగినట్లు ఇంద్రకరణ్ రెడ్డి సన్నిహితులు తెలిపారు. ఒకటి రెండ్రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం పక్కా అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే పార్టీ మార్పుపై ఇటు ఇంద్రకరణ్ రెడ్డి, చేర్చుకోవడంపై అటు జానారెడ్డి కానీ అధికారిక ప్రకటనలు చేయలేదు. కానీ ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇంద్రకరణ్ రెడ్డి కూడా హస్తం చెంతకు చేరతారనే ప్రచారానికి బలం చేకూరుతోంది. చూడాలి ఏం జరుగుతుందో.
Next Story






