Harish Rao: కాళేశ్వరం కమిషన్‌ పూర్తి నివేదిక ఇవ్వండి.. సీఎస్‌కు హరీశ్ రావు విజ్ఞప్తి

by Prasad Jukanti |

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదికను తమకు ఇవ్వాలని సీఎస్ కె.రామకృష్ణారావును మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కోరారు.

Harish Rao: కాళేశ్వరం కమిషన్‌ పూర్తి నివేదిక ఇవ్వండి.. సీఎస్‌కు హరీశ్ రావు విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదిక ప్రతులను తమకు అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును (CS Ramakrishna Rao) మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) కోరారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో బీఆర్ఎస్ నేతలతో పాటు హరీశ్ రావు సీఎస్ ను కలిశారు. మాజీ సీఎం కేసీఆర్ తరఫున, స్వయంగా తన తరఫున రెండు వినతిపత్రాలు సీఎస్ కు అందజేశారు. కాళేశ్వరం కమిషన్‌ తమను విచారించిన నేపథ్యంలో పూర్తి వివరాలు తెలియజేయాలని హరీశ్ రావు కోరారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టులోని ముుడు బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇటీవలే నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదకను గత సోమవారం రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా కమిషన్ రిపోర్టును తమకు ఇవ్వాలని హరీశ్ రావు కోరడం ఆసక్తిగా మారింది.

Next Story