కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీష్‌ రావు సమావేశం.. కవిత ఆరోపణల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)తో మాజీ మంత్రి హరీష్‌ రావు(Harish Rao) భేటీ అయ్యారు.

కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీష్‌ రావు సమావేశం.. కవిత ఆరోపణల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)తో మాజీ మంత్రి హరీష్‌ రావు(Harish Rao) భేటీ అయ్యారు. శనివారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు. అప్పటికే ఫామ్‌హౌస్‌(Erravelli Farmhouse)లో కేటీఆర్‌ ఉన్నట్లు సమాచారం. కల్వకుంట్ల కవిత ఆరోపణల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇదిలా ఉంటే.. పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో కేసీఆర్ తన ఫాంహౌజ్‌లో శుక్రవారం గణపతి యాగం నిర్వహించినట్టు వార్తలు వినిపించాయి. ఇటు కేసులు.. అటు విచారణలు.. కవిత ఎపిసోడ్ తలనొప్పిగా మారడంతో కేసీఆర్ ఈ యాగం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. కేసీఆర్‌కు ముందు నుంచి యాగాలు చేయడం అలవాటు. ఎప్పుడు క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఆయన యాగాలు చేస్తుంటారని టాక్. అందులో భాగంగానే తన కుటుంబసభ్యులతో కలిసి ఈ యాగం చేపట్టారని సమాచారం. అంతేకాకుండా గత ఐదారు రోజులుగా కేటీఆర్ ఫాంహౌజ్‌లోనే ఉండిపోయారు. అక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలను నడిపిస్తున్నారు. చివరకు పార్టీలో చేరికలను సైతం అక్కడి నుంచే కొనసాగిస్తున్నారు. ఈ యాగంలో కేటీఆర్ సైతం పాల్గొన్నారని సమాచారం.

Next Story