తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు కంగ్రాట్స్

by Disha Web Desk 12 |
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు కంగ్రాట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్క గారికి, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని అన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నానని మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.

Next Story