Ex Minister: సీఎం పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్‌ను టార్చర్ చేశారు

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

Ex Minister: సీఎం పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్‌ను టార్చర్ చేశారు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రాజ్యాంగ విరుద్ధంగా రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతోందని అన్నారు. లగచర్ల రైతుల(Lagacharla Farmers)కు బేడీలు వేసి భూములు లాక్కున్నారని మండిపడ్డారు. సినీ హీరో అల్లు అర్జున్(Allu Arjun), బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(Kaushik Reddy), లగచర్ల రైతులపై కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.

కల్తీ ఆహారంతో రాష్ట్రంలో రోజూ అనేకమంది విద్యార్థులు చనిపోతున్నారని.. ప్రభుత్వం ముందు వాటిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కల్తీ ఆహారం విషయంలో అసలు ముందు కేసు పెట్టాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదనే అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు అందరూ ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రేవంత్‌కు ఓటేసి కొడంగల్ రైతులు కూడా బాధపడుతున్నారని అన్నారు. కేవలం పేరు మర్చిపోయినందుకే సినిమా యాక్టర్‌ను అరెస్ట్ చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రైతులు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు.

Next Story