- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
BRS: భూభారతిలో ఆ ప్రస్తావన ఎందుకు లేదు?

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రైతులు పుట్టెడు దుఃఖంలో ఉన్నారని, పంటలు ఎండిపోయి కొందరు రైతులు బాధలో ఉంటే, మరికొందరు అకాల వర్షాలకు నష్టపోయారని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో, రైతు డిక్లరేషన్‌లో పంట ఏ రకంగా నష్టపోయినా పరిహారం ఇస్తామని వాగ్దానం చేశారని.. కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారని.. పంటల బీమా పథకం తెస్తామని తేలేదని ఆరోపించారు. నష్టాల్లో ఉన్న రైతులు, కౌలు రైతులకు ఊరట నిచ్చే ఒక్క చర్య కూడా ప్రభుత్వం చేపట్టడం లేదన్నారు. రైతులను పట్టించుకునే నాథుడే లేడని అన్నారు. అసైన్మెంట్, పోడు భూముల క్రయవిక్రయాలపై చట్టం తెస్తామని.. భూభారతిలో ఆ ప్రస్తావన ఎందుకు తేలేదని ప్రశ్నించారు.
కేసీఆర్‌పై కక్షతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై, ఏపీకి కృష్ణా జలాలు అక్రమంగా తరలిస్తున్నా స్పందన కరువైందన్నారు. మరోవైపు హైదరాబాద్‌కు తాగునీటి సమస్య కూడా వచ్చే ప్రమాదముందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు చేయకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన లేదని కేసీఆర్ అనేక సందర్భాల్లో స్పష్టం చేశారని.. కానీ, ఈ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు భరించడం భారంగా ఉందని అనేక వర్గాలు చర్చించుకుంటున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొన్నారు.