- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Botsa : వల్లభనేని వంశీ అరెస్టుపై మాజీ మంత్రి బొత్స రియాక్షన్
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు(Vallabhaneni Vamsi's Arrest)పై మాజీ మంత్రి బొత్స సత్యసత్యనారాయణ(Botsa Sathya Satyanarayana) స్పందించారు. వంశీ అరెస్టును తీవ్రంగా ఖండించిన బొత్స కక్షపూరితంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలే కూటమి ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారన్నారు

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు(Vallabhaneni Vamsi's Arrest)పై మాజీ మంత్రి బొత్స సత్యసత్యనారాయణ(Botsa Sathya Satyanarayana) స్పందించారు. వంశీ అరెస్టును తీవ్రంగా ఖండించిన బొత్స కక్షపూరితంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలే కూటమి ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారన్నారు. ఎంతసేపు కేసులు..అరెస్టులంటూ పబ్లిసిటీ స్టంటులు చేస్తూ ఎన్నికల హామీల వైఫల్యాలనుంచి ప్రజల దృష్టిని మళ్లీంచే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రజలు ఈ రకమైన రాజకీయాలను ఆకాంక్షించరని..హైకోర్టు సైతం పోలీస్ వ్యవస్థ పరిధిలు దాటుతుందని చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి మొట్టికాయల వంటివన్నారు.
అరెస్టులపై ఉన్న ఫోకస్.. పాలనపై పెడితే బాగుంటుందన్నారు. లేదు మీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తామనుకుంటే చట్ట పరంగా మేం పోరాటం చేస్తామని బొత్స స్పష్టం చేశారు. మాటిమాటికి వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసం అయిపోయిందని సీఎం చంద్రబాబు అంటున్నారని..అవన్ని చేతకాని వాడు చెప్పే మాటలని..ఎక్కడ ఏమి నాశనం అయిందని బొత్స ప్రశ్నించారు. రుషికొండలో అంతకుముందున్న టూరిజం గెస్ట్ హౌస్ స్థానంలో కొత్తది నిర్మించామని..దాంతో పర్యావరణ విధ్వంసం ఏం జరిగిందంటూ బొత్స అసహనం వెలిబుచ్చారు.
బెజవాడలో టెన్షన్ టెన్షన్..
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దళితుడ్ని కిడ్నాప్ చేసి బెదిరించారనే కేసులో పటమట పోలీసులు వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలోని మైహోమ్ భుజాలో ఉన్న వంశీని రాయదుర్గం పోలీసుల సహకారంతో గురువారం అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి నుంచి విజయవాడకు తరలించారు. వైసీపీ నేత అరెస్ట్‌తో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు మాజీ మంత్రి పేర్నినానిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు పటమట పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. నందిగామ దగ్గర వంశీ భార్య కారును కూడా అడ్డుకున్నట్లుగా సమాచారం. వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు 140, 308, 351 రెడ్ విత్ 3 (5) సెక్షన్ల కింద మొత్తం 7 కేసులు నమోదు చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్ అరెస్టుతో అల్లర్లు జరిగే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు భావించి కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది.






