- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగారంలో బాపూ గెలుపు..జగదీష్‌రెడ్డి ఎమోషనల్
స్థానిక సంగ్రామంలో 95 ఏండ్ల నవ యువకుడి విజయకేతనం అంటూ కొనియాడారు. బాపూ అని పిలుచే నాగారం.. స

దిశ, వెబ్ డెస్క్: సర్పంచ్ ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి ఘనవిజయం సాధించారు. తుంగతుర్తి నియోజకవర్గం నాగారం గ్రామం పంచాయతీ ఎన్నికల్లో 95 ఏళ్ల స్వాతంత్ర సమర యోధుడు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డి ఘనవిజయం సాధించారు. ఇక దీనిపై జగదీష్ రెడ్డి స్పందించారు. నాగారంలో బాపూ గెలుపు అని, సర్పంచ్ గా గుంటకండ్ల రామచంద్రారెడ్డి విజయం రాజకీయ చరిత్రలోనే సంచలానాత్మకమైన ఓ సరికొత్త రికార్డు అన్నారు.
స్థానిక సంగ్రామంలో 95 ఏండ్ల నవ యువకుడి విజయకేతనం అంటూ కొనియాడారు. బాపూ అని పిలుచే నాగారం.. సర్పంచ్ గా నిలిపి ప్రజనీకం గెలిపించుకుందన్నారు. 95 ఏండ్ల పోరాట స్ఫూర్తికి జైకొట్టిన ప్రజా ప్రభంజనం అంటూ వ్యాఖ్యానించారు. దీంతో సొంతూరుకు సర్పంచ్ గా సేవచేయాలనుకున్న కళ సాకారమైందన్నారు. నేటి యువతతో బరిలో దింపించి.. మెజార్టీతో గెలిపించారని వెల్లడించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.






