- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మావోయిస్టు నేత తల్లి మృతి
మాజీ మావోయిస్టు నేత కందగట్ల యాదగిరి (అలియాస్ భాస్కర్, అలియాస్ రాజ్ మాన్ దాదా) ఇంట విషాదం నెలకొంది. యాదగిరి తల్లి బుచ్చి మల్లన్న శుక్రవారం సాయంత్రం 7.30 గంటల సమయంలో అకాల మరణం చెందారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ మావోయిస్టు నేత కందగట్ల యాదగిరి (అలియాస్ భాస్కర్, అలియాస్ రాజ్ మాన్ దాదా) ఇంట విషాదం నెలకొంది. యాదగిరి తల్లి బుచ్చి మల్లన్న శుక్రవారం సాయంత్రం 7.30 గంటల సమయంలో అకాల మరణం చెందారు. నేడు సాయంత్రం 4.00 గంటలకు భట్టుపల్లి గ్రామంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కందగట్ల యాదగిరి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా చేశారు. మావోయిస్టు ఉద్యమంలో సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా అలుపెరగని పోరాటం చేస్తూ అజ్ఞాత జీవితాన్ని గడిపారు.
దళ సభ్యుడిగా పార్టీలో చేరి నాయకుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తించే స్థాయికి చేరుకున్నారు. మావోయిస్టు ఉద్యమంలో అశన్న టీంలో సభ్యుడిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అజ్ఞాత జీవితం తర్వాత 2026 మార్చిలో మావోయిస్టు ఉద్యమం నుండి బయటకు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం బహిరంగ జీవితాన్ని గడుపుతుండగా అడవి నుండి వచ్చిన కొంత కాలానికే తల్లి మరణించడం వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది.






