- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిందూర్‌కి ఒక న్యాయం.. కగార్‌కు ఒక న్యాయమా?: మాజీ ఐపీఎస్ సీరియస్
వరుస ఎన్‌కౌంటర్‌లతో మావోయిస్టు(Maoist Party) కీలక నేతలు మృతిచెందుతున్న విషయం తెసిలిందే.

దిశ, వెబ్‌డెస్క్: వరుస ఎన్‌కౌంటర్‌లతో మావోయిస్టు(Maoist Party) కీలక నేతలు మృతిచెందుతున్న విషయం తెసిలిందే. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్‌పై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) సీరియస్ అయ్యారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మావోయిస్టులపై వరుస ఎన్‌కౌంటర్లను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌కి ఒక న్యాయం.. ఆపరేషన్ కగార్‌కు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. లొంగిపోవడానికి వచ్చిన మావోయిస్టులను నిర్దాక్షిణ్యంగా ఎన్‌కౌంటర్ చేయడం ఏంటని మండిపడ్డారు. లొంగిపోవడానికి వచ్చిన ఎవరినీ ఎన్‌కౌంటర్ చేయకూడదని అన్నారు. అనంతరం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఆర్ఎస్పీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు రెండ్రోజుల్లో తేలుతుందని అన్నారు. ఈరోపు దమ్ముంటే.. సదరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని సవాల్ చేశారు. రాజీనామా చేయకపోతే బర్తరఫ్ తప్పదని అన్నారు. ప్రజలతో పాటు ఆ పదిమంది ఎమ్మెల్యేలను కూడా సీఎం రేవంత్ రెడ్డి తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు.






