మాజీ ENC మురళీధర్ రావు అరెస్ట్

by Muthe.Rajitha |

నీటిపారుదలశాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు (Muralidhar Rao)ను ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేసారు.

మాజీ ENC మురళీధర్ రావు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : నీటిపారుదలశాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు (Muralidhar Rao)ను ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేసారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా మంగళవారం ఉదయం నుంచి మురళీధర్ రావు (Muralidhar Rao) ఇంట్లో ఏసీబీ (ACB Raids) సోదాలు నిర్వహించింది. మొత్తం 11 చోట్ల ఈ తనిఖీల్లో ఆయన పేరు మీద కళ్ళు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. హైదరాబాద్, కరీంనగర్లో, వరంగల్, కోదాడలో భారీ భవనాలున్నట్టు తేలింది. కోకాపేట, బంజారాహిల్స్, యూసఫ్ గూడా, బేగంపేట్ వంటి పలు ప్రాంతాల్లో కోట్ల విలువ చేసేప్లాట్లు, ఇళ్లు ఉన్నట్టు గుర్తించారు. అలాగే సోలార్ పవర్ ప్రాజెక్టు, హైదరాబాద్ శివారులో 11 ఎకరాల భూమి, 4 ఇళ్ల స్థలాలు, మోకిలాలో 6,500 చదరపు గజాల స్థలంతోపాటు కేజీల కొద్దీ బంగారు ఆభరణాలు కలిగి ఉన్నారని అధికారులు తేల్చారు.

అయితే కాళేశ్వరం ప్రాజెక్టు బిల్లుల చెల్లింపులో కీలక పాత్ర పోషించిన మురళీధర్ రావు.. ఆ సమయంలో పెద్ద ఎత్తున చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరం నిధులను తన కుమారుడు అభిషేక్ రావుకు చెందిన సొంత కంపెనీల హర్ష కన్ స్ట్రక్షన్ కు మళ్లించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరంతో పాటు పాలమూరులోను భారీగా సబ్ కాంట్రాక్ట్ లు చేశారని, తన కుమారుడు అభిషేక్ బినామీలకు లబ్ధి చేకూరేలా మురళీధర్ రావు వ్యవహరించినట్లు సమాచారం. వర్క్ ఆర్డర్స్ జారీలోనూ మురళీధర్ రావు అకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Next Story