- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘‘లం... కొడకా’’ అంటూ మున్సిపల్ కమిషనర్‌పై రెచ్చిపోయిన మాజీ కౌన్సిలర్
‘‘ఏడున్నావ్ రా నువ్వు.. లం..కొడకా..’’ అంటూ మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డిపై మాజీ కౌన్సిలర్, కట్ట రవికిషన్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ‘‘ఏడున్నావ్ రా నువ్వు.. లం..కొడకా..’’ అంటూ మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డిపై మాజీ కౌన్సిలర్, కట్ట రవికిషన్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే తనకు సంబంధించిన పనులు చేయకపోవడం వల్లనో.. ఇతర కారణాల వల్లనో కట్ట రవికిషన్ రెడ్డి ఆగ్రహంతో కమిషనర్‌కు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించాడు. ఇందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ‘తనకు రవి కిషన్ రెడ్డి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించిన తీరు చాలా బాధను కలిగించింది. అతను నాకు చాలా సంవత్సరాల నుండి తెలిసిన వ్యక్తి. ఒక్కసారిగా ఇలా ప్రవర్తిస్తాడని ఊహించలేదు. దీనిపై ఆధారాలతో కలెక్టర్‌కు, జిల్లా ఎస్పీకి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి కంప్లైంట్ చేశాను’ అని ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాగా ఈ విషయమై మహబూబ్ నగర్ వన్ టౌ సీఐ అప్పయ్యను వివరణ కోరగా.. రవికిషన్ రెడ్డిపై కేసు నమోదు చేశాం.. దీనిపై చట్ట ప్రకారం ముందుకు వెళామని తెలిపారు.






