నకిలీ క్రిప్టో కరెన్సీ కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అరెస్ట్

by Elthuri vijay kumar |

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని ప్రజలను మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడైన కోతిరాంపూర్ కు చెందిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్‌ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

నకిలీ క్రిప్టో కరెన్సీ కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అరెస్ట్
X

నకిలీ క్రిప్టో కరెన్సీ కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అరెస్ట్

దిశ, కరీంనగర్ రూరల్ : క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని ప్రజలను మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడైన కోతిరాంపూర్ కు చెందిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్‌ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తీగలగుట్టపల్లికి చెందిన నున్సావత్ భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ‘మెటా ఫండ్ క్రిప్టో’ పేరుతో స్కీమ్‌లో 50 లక్షల పెట్టుబడి పెడితే మూడింతలు లాభం వస్తుందని భాస్కర్ తో నమ్మబలికాడు. దీంతో కట్ల సతీష్ మాటలు నమ్మిన భాస్కర్ 15 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అంతేకాకుండా, మరిన్ని లాభాలు వస్తాయని చెప్పడంతో తనకు పరిచయస్తులైన మరో 17 మందిని కూడా చేర్చించాడు. దీంతో వారి నుంచి మొత్తం రూ.1.20 కోట్లు వసూలు చేసిన కట్ల సతీష్ హామీ మేరకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి, సీసీఎస్ సీఐ ప్రకాష్ గౌడ్, ఎస్‌ఐలు నరేష్, తిరుపతి మరియు సిబ్బంది నిందితుడిని అరెస్ట్ చేశారు. సతీష్ వద్ద నుంచి ఒక ఐపాడ్, రెండు మొబైల్ ఫోన్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలను స్వాధీనం చేసుకున్నారు. సతీష్‌ను కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కేసు త్వరగా చేధించిన రూరల్ పోలీసులు, సిబ్బందిని కమిషనర్ గౌస్ ఆలం అభినందించారు.

Next Story