- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YS Jagan : అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన మాజీ సీఎం వైఎస్.జగన్
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ధ జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ (Allu Arjun)ప్రమేయం లేకపోయినా క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదని... అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) ఎక్స్ వేదికగా పేర్కొన్నారు

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ధ జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ (Allu Arjun)ప్రమేయం లేకపోయినా క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదని... అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిదన్నారు. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారని గుర్తు చేశారు.
అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అల్లు అర్జున్ అరెస్టును వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అటు హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై వైసీపీ రాజ్యసభ ఎంపీ, న్యాయవాది, నిర్మత నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించడం గమనార్హం.






