MLC Kavita: కేసీఆర్ కృషి ఫలించింది.. ఎక్స్‌ వేదికగా ఎమ్మెల్సీ కవిత హర్షం

by Ramesh Naini |

బీడుబడ్డ తెలంగాణ భూములకు కృష్ణా జలాలను మళ్లించాలని ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన కృషి ఫలించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

MLC Kavita: కేసీఆర్ కృషి ఫలించింది.. ఎక్స్‌ వేదికగా ఎమ్మెల్సీ కవిత హర్షం
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీడుబడ్డ తెలంగాణ భూములకు కృష్ణా జలాలను మళ్లించాలని ఉద్యమ నేత, మాజీ సీఎం (KCR) కేసీఆర్ చేసిన కృషి ఫలించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత తన ఎక్స్ వేదికగా ఇవాళ ట్వీట్ చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా నీళ్లలో మా వాటా మాకే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పోరాట ఫలాలు అందుకోవడం ఎంతో దూరంలో లేదని తెలిపారు. రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ జరపాలని గత పదేళ్లుగా కేసీఆర్ చేసిన వాదనకే (Brijesh Kumar Tribunal) బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మొగ్గు చూపడం సంతోషకరమన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం, తెలంగాణ ప్రజల విజయమని తెలిపారు.

కాగా, (Krishna Water Dispute) కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం ప్రకారం మొదటగా రెండు రాష్ట్రాల వాదనలు వినాలని ట్రిబ్యునల్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు వాదనలు వింటామని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. వాదనలు పూర్తి అయిన తర్వాత ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం తుది వాదనలు వింటామని స్పష్టం చేసింది. అనంతరం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల అంశాన్ని చేపడతామని తాజాగా ప్రకటించింది.

Next Story