- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విదేశాల్లో సైతం కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్!
by Ramesh Naini |
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సంగతి తెలిసిందే.

X
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ జన్మదిన వేడుకలు ఇతర దేశాల్లో కూడా నిర్వహించనున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ 70 వ జన్మదిన వేడుకలను ప్రపంచమంతా ఎన్ఆర్ఐలు ఘనంగా నిర్వహిస్తారని బీఆర్‌ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల వెల్లడించారు.
ప్రపంచ వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరపాలని వివిధ దేశాల బీఆర్‌ఎస్ ప్రతినిధితులను కోరినట్లు ఆయన తెలిపారు. కొన్ని దేశాల్లో బ్లడ్ డొనేషన్ డ్రైవ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు సంఘీభావంగా మొక్కలు నాటడం, అనాథలకు సహాయం చేయడం వంటి వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఎన్ఆర్ఐలు అంతా ఈ కేసీఆర్ జన్మదిన వేడులకలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Next Story






