- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR : పాస్ పోర్టు ఆఫీస్ కు మాజీ సీఎం కేసీఆర్!..వైరల్ గా సామ ట్వీట్!!
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్KCR) ఈ రోజు సికింద్రాబాద్ పాస్ పోర్టు ఆఫీస్(Secunderabad Passport Office) కు చేరుకున్నారు

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్KCR) ఈ రోజు సికింద్రాబాద్ పాస్ పోర్టు ఆఫీస్(Secunderabad Passport Office) కు చేరుకున్నారు. తన డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌ను సబ్మిట్ చేసి సాధారణ పాస్‌పోర్ట్‌ను తీసుకునేందుకు కేసీఆర్ సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి వచ్చారు.ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన కేసీఆర్ సికింద్రాబాద్ లోని పాస్ పోర్టు కార్యాలయంలో పాస్ పోర్టు రెన్యువల్(Passport renewal)పని కోసం వెళ్లారు.
అనంతరం నందినగర్ లోని నివాసంలో కాసేపు విశ్రాంతి తీసుకుని అక్కడినుంచి నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్లి పార్టీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు. వచ్చె నెలలో కేసీఆర్ అమెరికా(KCR to visit America next month) వెళ్లి తన మనమడు హిమాన్షుతో కొన్ని రోజులు గడిపేందుకు పాస్ పోర్టు రెన్యువల్ చేయించుకున్నారని సమాచారం.
అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సికింద్రాబాద్ పాస్ పోర్టు ఆఫీస్ కు కేసీఆర్ వెళ్లడాన్ని ప్రశ్నిస్తూ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. కాసేపట్లో సికింద్రాబాద్ పాస్ పోర్టు ఆఫీస్ కు కేసీఆర్ వెళ్లనున్నారంటూ.. పాస్ పోర్టు శేఖర్..పాస్ పోర్టు కార్యాలయానికి దేనికోసం వెలుతున్నారంటూ? సామ తన ట్వీట్ లో ప్రశ్నించారు.
పరారైన మాజీ డీఐజీ ప్రభాకరరావు స్ఫూర్తి అయితే కాదు కదా? అంటూ సామ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో సామా ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.






