ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయాం: మాజీ సీఎం కేసీఆర్

by Vemula.Srinu Prasad |

వనజీవి రామయ్య మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు...

ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయాం: మాజీ సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: వనజీవి రామయ్య(వనజీవి Ramaiah) మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) విచారం వ్యక్తం చేశారు. ఒక ప్రపంచ పర్యావరణవేత్తను తెలంగాణ(Telangana) కోల్పోయిందని చెప్పారు. శోకంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రామయ్య మరణం పచ్చదనానికి తీరని లోటు అని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా రామయ్య బతికారని తెలిపారు. వృక్షో రక్షతి రక్షితః అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని, కోటికి పైగా మొక్కలను నాటి, ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన వనజీవి రామయ్య లక్ష్యం మహోన్నతమైనదని చెప్పారు. మొక్కల పెంపకం కోసం వనజీవిగా మారిన దర్పల్లి రామయ్య జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమన్నారు. ప్రపంచ పర్యావరణ కోసం సాగిన మానవ కృషిలో వనజీవిగా వారు చేసిన త్యాగం అసమాన్యమైనదని కేసీఆర్ కొనియాడారు.

తెలంగాణకు హరితహారం(Greenery) అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రామయ్య అందించిన సహకారం గొప్పదని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తు తరాలకు మనం అందించే సంపద హరిత సంపదే కావాలని, భౌతిక ఆస్తులు కావని చెప్పారు. పచ్చని అడవులను ధ్వంసం చేస్తూ, వన్యప్రాణులకు నిలువనీడ లేకుండా ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న పర్యావరణ వ్యతిరేక ధోరణులను నిలువరించడానికి, వర్తమాన పరిస్థితుల్లో వేలాది వనజీవి రామయ్యల అవసరం ఉన్నదని కేసీఆర్ పేర్కొన్నారు.

Next Story