Viral News : కారు నడిపిన కేసీఆర్.. మాజీ మంత్రి కొడుకుని కూర్చోబెట్టుకుని మరీ!

by Ramesh Naini |

బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ కారు నడిపిన ఫోటోలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Viral News : కారు నడిపిన కేసీఆర్.. మాజీ మంత్రి కొడుకుని కూర్చోబెట్టుకుని మరీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ (KCR)​ కారు నడిపిన ఫోటోలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు పట్లోల్ల కార్తీక్ రెడ్డి (Patlolla Karthik Reddy)ని పక్కన కూర్చోబెట్టుకుని కేసీఆర్ కారు నడిపారు. ఇద్దరు కలిసి పంట పొలాలను పరిశీలించారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో.. మళ్లీ ప్రజల్లోకి వచ్చే సంకేతాలు గులాబీ బాస్ ఇస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పులి బయటకు వస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. శనివారం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ వద్ద పాలకుర్తి నయోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కేసీఆర్ సమావేశం అయ్యారు. మొదటి సారి రాజకీయ పరమైన అంశాలను చర్చించారు. వచ్చే ఎన్నికల్లో 100 శాతం మనమే అధికారంలోకి వస్తామని ప్రకటించారు.

Next Story