- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR: విమాన ప్రమాదం.. కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక విజ్ఞప్తి
గుజరాత్ రాష్ట్రం అహ్మాదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Ahmedabad Plane Crash) గుజరాత్ రాష్ట్రం అహ్మాదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివాసాల మీద విమానం కూలడంతో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రయాణికులు, సామాన్యులు, సహా, వైద్య విద్యార్థులు మరణించడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ, సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన కుటుంబాలను ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కేసీఆర్ కీలక విజ్ఞప్తి చేశారు. తమ ఆప్తులను కోల్పోయి శోకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పవిత్రమైన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ మేరకు కేసీఆర్ ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన (Air India) ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాలకే నేలకూలింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ముఖ్యంగా అమహ్మాదాబాద్‌లో బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై ఈ విమానం కూలిపోయింది. దీంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఈ ప్రమాదంలో ఎంత మంది చనిపోయారనే ఇంకా అధికారిక లెక్కలు వెల్లడి కాలేదు. దాదాపు 133కు పైగా చనిపోయారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.






