- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ రాజకీయాల్లో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన(Konda Laxma Reddy) హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. నగరంలోని మహా ప్రస్థానంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, జర్నలిజం పట్ల మక్కువతో 1980లో స్థానిక వార్తా సంస్థ NSSను లక్ష్మారెడ్డి ప్రారంభించారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేపిన కొండా వెంకట రంగారెడ్డి మనవడు లక్ష్మారెడ్డి కావడం గమనార్హం. 1999, 2014లో హైదరాబాద్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. కాగా లక్ష్మారెడ్డి జీవితకాలం కాంగ్రెస్‌లోనే కొనసాగడం విశేషం. ఆయన మరణ వార్త తెలిసిన తెలుగు రాజకీయ నేతలు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంతాపం ప్రకటిస్తున్నారు.






