Shakeel arrest: ఎట్టకేలకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టు

by Prasad Jukanti |   (  Updated:2025-04-10 07:12:46  IST  )

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Shakeel arrest:  ఎట్టకేలకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే  షకీల్ అరెస్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పరారీలో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఇవాళ శంషాబాద్ ఎయిర్ పోర్టును ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వివిధ కేసుల్లో షకీల్ పై అరెస్టు వారెంటు ఉంది. 2023 లో ప్రజా భవన్ (ప్రగతి భవన్) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన తన కుమారుడిని తప్పించారని షకీల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత తన కుమారుడు రహేల్ దుబాయ్ పారిపోవడానికి షకీల్ సహకరించారని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. ఈ కేసులో షకీల్ ఏ3గా ఉన్నారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ పరారీలో ఉన్నారని హైదరాబాద్ పోలీసులు గతంలో వెల్లడించారు. దీంతో గత కొంత కాలంగా షకీల్ సైతం రాష్ట్రాన్ని వీడి దుబాయ్ లోనే మకాం వేశారు. ఈ క్రమంలో తాజాగా ఆయన తల్లి మరణించగా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు షకీల్ ఇవాళ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అలర్ట్ అయిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు.

Next Story