- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీలో చేరిన ఆరూరి రమేశ్.. కండువా కప్పిన కిషన్ రెడ్డి
by GSrikanth |
బీఆర్ఎస్ కీలక నేత, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీలో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ కీలక నేత, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీలో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఆరూరి రమేశ్ వరంగల్ పార్లమెంట్ సీటు ఆశిస్తున్నారు. దీనిపై ఇటీవలే తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా అమిత్ షాను కలిసి సీటు విషయమై హామీ తీసుకున్నారు. స్పష్టమైన హామీతోనే ఆ పార్టీలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీ తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం అయిన వరంగల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆరూరి బరిలో ఉండనున్నారు.
Next Story






