TG Govt: పాశమైలారం ప్రమాద ఘటనపై నిరుపణుల కమిటీ ఏర్పాటు.. కమిటీ సభ్యులు ఎవరంటే?

by Prasad Jukanti |   (  Updated:2025-07-02 13:04:51  IST  )

పాశమైలారం ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

TG Govt: పాశమైలారం ప్రమాద ఘటనపై నిరుపణుల కమిటీ ఏర్పాటు.. కమిటీ సభ్యులు ఎవరంటే?
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తీవ్ర విషాదం నింపిన సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని (Pashamailaram) సిగాచి పరిశ్రమలో (Sigachi Accident) పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ (Experts Committee) ఏర్పాటు చేసింది. నలుగురు శాస్త్రవేత్తలతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ఐఆర్ శాస్త్రవేత్త వెంకటేశ్వర రావు అధ్యక్షతన, కమిటీ సభ్యులుగా చీఫ్ సైంటిస్ట్ ప్రతాప్ కుమార్, సూర్యానారాయణ, పూణెకు చెందిన భద్రతా అధికారి సంతోశ్ ఘుగేతో కూడిన కమిటీని నియమిస్తూ గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. సిగాచి ఇండస్ట్రీలో ప్రమాదానికి దారి తీసిన కారణాలు గుర్తించడంతో పాటు పరిశ్రమల్లో కార్మికుల భద్రత కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు అమలు అవుతున్నాయా లేదా? యాజమాన్యాలు అనుసరించాల్సిన నిబంధనలు పాటిస్తున్నాయా అనే అంశాలను గుర్తించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే రసాయన, ఔషధ పరిశ్రమలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేయాలని పేర్కొంది. నెల రోజుల్లోపు నిర్ధిష్టమైన సూచనలు, సిఫార్సులు చేయాలని ఆదేశించింది.

Next Story