- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Esha Singh: మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం
రంగారెడ్డి జిల్లా దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ(Dhulapalli Forest Academy)లో తెలంగాణ అటవీశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అటవీ సిబ్బంది క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ(Dhulapalli Forest Academy)లో తెలంగాణ అటవీశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అటవీ సిబ్బంది క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ప్రముఖ భారతీయ షూటర్ ఇషాసింగ్ హాజరయ్యారు. అన్ని జోన్లకు సంబంధించిన ఆటగాళ్లు మార్చ్ ఫాస్ట్ నిర్వహించి అటవీశాఖ వన్యప్రాణి ప్రధాన సంరక్షిణాధికారి(వైల్డ్ లైఫ్ చీఫ్) ఈలు సింగ్ మేరుకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి వెలిగించి పోటీలను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ సిబ్బంది వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి కఠినమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని తెలిపారు. శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటుగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి సంవత్సరం ఇలా రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. క్రీడల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరూ క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు. చిన్న వయసులోనే ఈషా సింగ్ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గౌరవం తెచ్చిన యువ క్రీడాకారిణిగా అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఇషాసింగ్(Esha Singh) మాట్లాడుతూ.. ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం గర్వంగా ఉందన్నారు.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.. దీనిద్వారా అడవుల పెరుగుదలతో పాటుగా పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు.. పచ్చదనం పెంపొందించేందుకు అటవీ అధికారులు చర్యలు అభినందనీయమని తెలిపారు..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7 జోన్లకు చెందిన సుమారు 750 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు.. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లు నవంబర్ రెండో వారంలో డెహ్రాడూన్‌లో జరిగే జాతీయ క్రీడల పోటీల్లో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు.. ఈ కార్యక్రమంలో సీసీఎఫ్‌లు శర్వణన్, రామలింగం, ప్రియాంక వర్గీస్, ప్రభాకర్, భీమానాయక్, అకాడమీ డైరెక్టర్ SJ ఆశ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






