- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చరిత్రలో తొలిసారి మేడారంలో కేబినెట్ భేటీ.. సమావేశానికి సర్వం సిద్ధం
హైదరాబాద్ వెలుపల రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మేడారంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. నేడు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ వెలుపల రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మేడారంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. నేడు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సంబంధించి మేడారంలోని హరిత హోటల్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సమావేశ ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. కేబినెట్ భేటీలో పురపాలక ఎన్నికలు, రైతు భరోసా, మేడారం జాతర ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రాత్రి అక్కడే బస చేసి, రేపు ఉదయం వనదేవతలను దర్శించుకోనున్నారు. రాష్ట్ర పరిపాలనలో మేడారానికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ నిర్వహిస్తున్న ఈ సమావేశం రాజకీయంగా, పరిపాలనా పరంగా విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.
భద్రత కట్టుదిట్టం..
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సందర్భంగా మేడారంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం హెలిప్యాడ్ స్థలం, హరిత హోటల్, టెంట్ సిటీ, సాంస్కృతిక కార్యక్రమాల సభా ప్రాంగణం తదితర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డీజీపీ శివధర్‌రెడ్డి, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించగా ములుగు ఎస్పీ సుదీర్ రాంనాథ్ కేకన్ భద్రతా ఏర్పాట్లపై మేడారంలోని కమాండ్ కంట్రోల్ రూంలో సమీక్షించారు. బందోబస్తు విధుల కోసం 1,600 మంది పోలీసులను మోహరించినట్లు అధికారులు తెలిపారు.






