- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bhatti Vikramarka: ఐదేళ్లలో రైతుల కోసం రూ. 3 లక్షల 50 వేల కోట్లు: భట్టి విక్రమార్క
రైతుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెల్లోనే రూ. 21 వేల కోట్లు రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. రాష్ట్రంలోని 1.49 కోట్ల ఎకరాలకు రైతుభరోసా (Rythu Bharosa) నగదు బదిలీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రారంభించారని 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతుల ఖాతాలో వేసిన చరిత్ర ఈ దేశంలోని మిగతా ఏ రాష్ట్రంలో జరగలేదని కేవలం తెలంగాణ ప్రభుత్వంలోనే జరుగుతోందన్నారు. భూపాలపల్లి (Bhupalpalli) జిల్లాలో మరో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇవాళ వేయాల్సిన రైతు భరోసా నిధులను ఇందాకే రైతుల ఖాతాల్లో జమ చేశామని ఏడాది కాలంలో రైతుల కోసం రూ. 70 వేల కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిందన్నారు. ఐదేళ్లలో రూ. 3 లక్షల 50 వేల కోట్లు రైతుల కోసం ఖర్చుచేయబోతున్నామన్నారు. భూమిలేని వ్యవసాయ కూలీల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కిందా ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 12 వేలు అందజేస్తోందన్నారు. రైతుల కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలు గమనించాలన్నారు. ఇప్పటికే రేషన్ కార్డులున్న 90 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదని మేము అధికారంలోకి వచ్చాక ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తోందన్నారు.
మాపై బీఆర్ఎస్ దుష్ప్రచారం:
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ ఉండదని గత ప్రభుత్వ నేతలు దుష్ప్రచారం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కానీ మేము అధికారంలోకి వచ్చాక ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశామన్నారు. ఈ ఏడాది మార్చిలో గరిష్ఠంగా 17,162 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడిందని నిరంతరాయ విద్యుత్ సరఫరాకు కృషి చేసిన అధికారులు, సిబ్బందికి ధన్యవాదులు తెలిపారు. 29 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.సమస్యలు ఉన్నవారు రాజధాని వరకు రాలేరు. ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించే వాళ్లు ఉండటం గొప్ప విషయం అన్నారు.






