Manohar Lal Khattar : తెలంగాణకు సమృద్ధిగా ఇండ్లు : కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్

by Y. Venkata Narasimha Reddy |

దేశ వ్యాప్తంగా ఈ ఏడాది కోటి ఇండ్ల(One CroreCountry This Year)ను నిర్మించబోతున్నామని..తెలంగాణకు రావాల్సిన వాటా కంటే ఎక్కువ ఇండ్లను మంజూరు చేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్(Union Minister Manohar Lal Khattar)హామీ ఇచ్చారు.

Manohar Lal Khattar : తెలంగాణకు సమృద్ధిగా ఇండ్లు : కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్
X

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా ఈ ఏడాది కోటి ఇండ్ల(One CroreCountry This Year)ను నిర్మించబోతున్నామని..తెలంగాణకు రావాల్సిన వాటా కంటే ఎక్కువ ఇండ్లను మంజూరు చేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్(Union Minister Manohar Lal Khattar)హామీ ఇచ్చారు. కరీంనగర్ బహిరంగ సభ(Karimnagar Public Meeting)లో ఆయన మాట్లాడారు. ఈ దేశంలో పార్టీలు, జెండాలు, ఎజెండాలు, కుల, మత బేధాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలనేది ప్రధాని మోడీ లక్ష్యమన్నారు. అందుకే గత పదేళ్లలో పీఎం గ్రామీణ ఆవాస్ యోజన కింద 2 కోట్ల 68 లక్షల ఇండ్లు, పీఎం అర్బన్ ఆవాస్ యోజన కింద 90 లక్షల ఇండ్లు కలిపి మొత్తం 3 కోట్ల 58 లక్షల ఇండ్లను నిర్మించామన్నారు.

రాబోయే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన పథకం కింద దేశంలో మరో 3 కోట్ల ఇండ్లను నిర్మించాలని మోదీ నిర్ణయించారని..ఈ ఏడాది కోటి ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. అందులో తెలంగాణకు రావాల్సిన వాటా కంటే అధికంగా ఇండ్లు మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే సంకల్పాన్ని పెట్టుకున్నారని..జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా దేశంలోని 74% గృహాలకు స్వచ్ఛమైన అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. దీనివల్ల దేశవ్యాప్తంగా డయేరియా సంబంధిత మరణాలు మూడు లక్షల తగ్గాయని.. సమీప భవిష్యత్తులోనూ ఆ మరణాల సంఖ్య తగ్గిపోతుందన్నారు.

జల్ జీవన్ మిషన్ కింద దేశవ్యాప్తంగా 12 కోట్ల ఇండ్లకు నల్లా కనెక్షన్లు మంజూరు చేశామని.. తెలంగాణలో 38 లక్షల 30 వేల ఇండ్లకు నల్లా కనెక్షన్లు అందించామని తెలిపారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు అన్ని కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఉన్నాయంటే అది జల్ జీవన్ మిషన్ వల్లే సాధ్యమైందని..కానీ కొందరు మిషన్ భగీరథ పేరుతో వారి ఘనతేనని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుందన్నారు. “హర్ ఘర్ నల్ సే జల్ “ పథకం కింద 2023 సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా మూడు కోట్ల కనెక్షన్ ఇచ్చామని.. మరో నాలుగేళ్ళల్లో దేశంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని కుళాయి ద్వారా అందించబోతున్నామని తెలిపారు.

స్మార్ట్ సిటీ మిషన్ కింద తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ నగరాలకు రూ.1,116 కోట్ల నిధులు విడుదల చేశామని. 122 ప్రాజెక్టులకు సంబంధించి రూ.2,733 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నయని..స్మార్ట్ సిటీ కింద కరీంనగర్ కు రూ.826 కోట్లు వచ్చాయని. ఇందులో కేంద్రం నుండి రూ.428 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.398 కోట్లు విడుదలయ్యాయని. మిగతా పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.

పీఎం స్వనిధి కింద దేశవ్యాప్తంగా 67 లక్షల 90 వేల మందికి లబ్ది చేస్తే... తెలంగాణలో 4 లక్షల 25 వేల మందికి లబ్ది జరిగిందని,. పీఎం ముద్ర పేరిట దేశవ్యాప్తంగా రూ.30 లక్షల కోట్ల (కొలెటరాల్ ఫ్రీ లోన్స్) రుణాలను 50 కోట్ల మంది ఖాతాల్లో జమ చేయగా, తెలంగాణలో 73 లక్షల అకౌంట్లలో రూ.73 వేల కోట్లు జమ చేశామని తెలిపారు. తెలంగాణ విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని మా ప్రభుత్వం గత పదేళ్లలో 10 లక్షల కోట్లకు పైగా నిధులను తెలంగాణ అభివృద్ధి కోసం, ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేసిందన్నారు.

పన్నుల రూపేణా రూ.2.3 లక్షల కోట్లు, వివిధ పథకాల కింద రూ. 6.2 లక్షల కోట్లు తెలంగాణకు కేటాయించామని, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద తెలంగాణకు గత పదేళ్లలో రూ.1 లక్ష కోట్లు కేటాయించామని, ఈ ఆర్ధిక (2024-25) సంవత్సరంలోనే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ.21 వేల 636 కోట్లను కేటాయించేలా బడ్జెట్ అంచనాలను రూపొందించామని..కాని కేంద్రం కేటాయించిన నిధులను సకాలంలో ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని.. యుటిలైజేషన్ సర్టిఫికేట్ (యూసీ) ను సమర్పించడంలో జాప్యం చేయడంవల్ల కేంద్రం రావాల్సిన నిధులు కూడా ఆగిపోతున్నాయని వివరించారు.

తెలంగాణలో రోడ్ల నిర్మాణం కోసమే కేంద్రం రూ.1 లక్షా 20 వేల కోట్లు, వడ్ల కొనుగోళ్ల కోసం రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేశామని, రీజనల్ రింగ్ రోడ్డు కోసం రూ.26 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. తెలంగాణలో రైల్వే లేన్, స్టేషన్ల అభివృద్ధికి గత పదేళ్లలో రూ.32 వేల 946 కోట్లను కేటాయించి రాష్ట్రంలో రైల్వే స్టేషన్ల రూపురేఖలే మారుస్తున్నామని. ఈ ఒక్క ఆర్ధిక (2024-25) సంవత్సరంలోనే రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు రూ.5 వేల 336 కోట్లను కేటాయించామన్నారు.

సంక్షేమంతో తెలంగాణకు పెద్దపీట

దేశవ్యాప్తంగా 52 కోట్ల 20 లక్షల మందికి ‘జన్ ధన్’ పేరిట బ్యాంకు ఖాతాలను ప్రారంభిస్తే.. అందులో తెలంగాణలోని 1 కోటి 20 లక్షల ఖాతాల్లోకి నేరుగా కేంద్రం వివిధ సంక్షేమ పథకాల సబ్సిడీని జమ చేస్తున్నం. అట్లాగే పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన కింద దేశవ్యాప్తంగా 20 కోట్ల మందికి జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, తెలంగాణలో 69 లక్షల 80 వేల మంది ఈ పథకంలో కొనసాగుతున్నారని, అట్లాగే పీఎం సురక్షా బీమా యోజన కింద దేశవ్యాప్తంగా 44 కోట్ల 50 లక్షల మంది బీమా పథకంలో చేరితే, తెలంగాణలో 1 కోటి 50 లక్షల మంది కొనసాగుతున్నారని మనోహర్ లాల్ వెల్లడించారు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద దేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందించగా.. తెలంగాణలో 1 కోటి 91 లక్షల మంది లబ్ది పొందుతున్నారని, ఉచితంగా బియ్యం అందించే పథకాన్ని 2029 వరకు కొనసాగించాలని నిర్ణయించామని తెలిపారు.

స్వచ్ఛ భారత్ కింద 11 కోట్ల 78 కోట్ల మరుగుదొడ్లు నిర్మించగా.. తెలంగాణలో 31 లక్షల 27 వేల టాయిలెట్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించామన్నారు. ఉజ్వల యోజన కింద 10 కోట్ల 33 లక్షల కుటుంబాలకు ఎల్‌పిజి కనెక్షన్లు అందించగా, తెలంగాణ విషయానికొస్తే... 11 లక్షల 85 వేల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసి ఆడపడచులకు కట్టెల పొయ్యి బాధ లేకుండా చేశామని వివరించారు. పీఎం కిసాన్ యోజన కింద దేశవ్యాప్తంగా 9 కోట్ల 58 వేల మంది రైతులకు ఏటా రూ.6 వేల ఆర్థిక సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుండగా.. తెలంగాణలో 30 లక్షల 70 వేల మంది రైతులు లబ్ది పొందుతున్నారని..దీనికి ఎరువుల సబ్సిడీకి అదనమని.. ఎరువుల మీద ఇప్పటి వరకు దాదాపు రూ.30 వేల కోట్ల రూపాయల సబ్సిడీని తెలంగాణ రైతులకు అందించామని తెలిపారు.

ఒక్కో యూరియా బస్తా మీద రూ. 2,236 లు సబ్సిడీ ఇస్తున్నామని.. రామగుండంలో యూరియా పరిశ్రమ ఏర్పాటు చేసి ఎరువుల కొరత అనేది లేకుండా చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. రోజ్ గార్ మేళా పేరుతో ఎలాంటి అవినీతికి, జాప్యానికి తావు లేకుండా నిర్ణీత వ్యవధిలో పరీక్షలు నిర్వహించి 9.25 లక్షల మందికి నియామక పత్రాలు అందించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని.. మరికొద్ది రోజుల్లోనే మోదీ హామీ ఇచ్చినట్లు 10 లక్షల మందికి ఉద్యోగ నియమక పత్రాలను అందజేయబోతున్నామని తెలిపారు.

కరీంనగర్ డంప్ యార్డ్ ను ఎత్తేస్తాం

కరీంనగర్ డంప్ యార్డ్ ను ఎత్తేస్తామని, అందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రమే మంజూరు చేస్తుందని, విద్యుత్ విషయంలోనూ తెలంగాణకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ లో పైలెట్ ప్రాజెక్టు కింద ఐదు డివిజన్లో 4,055 ఇళ్లకు 24 గంటల పాటు తాగునీటిని అందించాలనే ఆశయం నెరవేరడానికి అంకురార్పణ చేయడం ఆనందంగా ఉందని, ఈరోజు ప్రారంభంలో భాగంగా 2,200 ఇళ్లకు 24 గంటల పాటు తాగునీటిని ప్రారంభించామని. మిగతావి త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రూ.18 కోట్ల వ్యయంతో ఇలా ప్రజలకు మేలు చేయడం సంతోషదాయకమన్నారు.

దేశంలో ఇలా ఎక్కువ ఇళ్లకు 365 రోజులపాటు తాగునీటిని అందించిన కరీంనగర్ కార్పొరేషన్ కు దక్కుతుందని, గతంలోనూ చండీగఢ్ లోని మణిమజ్రా 24/7 గంటలపాటు తాగునీటిని హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారని,కర్ణాటక రాష్ట్రంలోని మూడు పట్టణాల్లో ను పైలెట్ ప్రాజెక్టుగా ఇతర నీటి సరఫరాను అమలు చేయాలని ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ కూడా స్మార్ట్ సిటీ నిధులను అమృత్-1,2నిధులను సద్వినియోగం చేసుకోవడంలో ముందుందన్నారు.

సఫాయిమిత్ర సురక్ష చాలెంజ్ 2022లో కరీంనగర్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ లో క్వారెంటైన్ విధానాన్ని మొదటిసారి అవలంబించి కరోనాను వ్యాప్తి చెందకుండా అరి కట్టారని, అంతేకాకుండా వ్యాక్సినేషన్ విషయంలోనూ ఇక్కడే మొదటిసారి ఫస్ట్ డోసు అందరికీ పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారని, వాటర్ ప్లస్ కార్యక్రమంలో భాగంగా.. కరీంనగర్ కార్పొరేషన్ లో వాడిన నీటిని మళ్లీ యుటిలైజేషన్ చేసే విషయంలో 2023లో ఉన్నత స్థానంలో నిలిచిందని, పీఎం స్వనిధి పథకం అమలు విషయంలో కరీంనగర్ దేశంలో రెండో స్థానంలో నిలిచిందని అభినందించారు

Next Story