GOAT India Tour: హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ! ఎప్పుడంటే..?

by Ramesh Naini |

ప్రపంచ ఫుట్‌బాల్‌లో అగ్రగామి ఆటగాడు, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ ఈ డిసెంబర్‌లో భారత్ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ను సందర్శించనున్నారు.

GOAT India Tour: హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ! ఎప్పుడంటే..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ ఫుట్‌బాల్‌లో అగ్రగామి ఆటగాడు, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ (Messi) ఈ డిసెంబర్‌లో భారత్ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ను సందర్శించనున్నారు. “The G.O.A.T India Tour – 2025” లో భాగంగా మెస్సీ హైదరాబాద్‌ రానున్నట్లు సమాచారం. ఈ మేరకు తాజాగా The G.O.A.T India Tour ప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పోస్టర్ విడుదల చేశారు.

తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన #TelanganaRising కార్యక్రమానికి మెస్సీని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక, మెస్సీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సమాచారం. ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు తెలంగాణ ప్రతిష్టను ప్రాతినిధ్యం వహించనున్నట్లు వార్తలు రావడం, మెస్సీ నగర పర్యటనకు రావడంపై అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

Next Story