- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిండిలో పురుగులు, కుళ్లిపోయిన కూరగాయలు.. లులుమాల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
హైదరాబాద్ లోని లులు మాల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల్లో పురుగులు ఉన్నట్టు, నాసిరకం ఆహార పదార్థాలు వినియోగిస్తునట్టు గుర్తించారు. కిచెన్ లో అపరిశుభ్రత, పాడైన కూరగాయలు ఉన్నట్టు గుర్తించారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని లులు మాల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల్లో పురుగులు ఉన్నట్టు, నాసిరకం ఆహార పదార్థాలు వినియోగిస్తునట్టు గుర్తించారు. కిచెన్ లో అపరిశుభ్రత, పాడైన కూరగాయలు ఉన్నట్టు గుర్తించారు. అంతే కాకుండా గడువుపూర్తైన ఆహార పదార్థాలపై లేబుళ్లు, పప్పులు, పిండిలోనూ పురుగులు చూసి అధికారులు షాక్ అయ్యారు. మాంసం వ్యర్థాలతో డ్రెయిన్లు మూసుకుపోయినట్టు గుర్తించారు. మాల్‌లో నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు. సుమారు 150 కిలోల కల్తీ, నాణ్యత లేని వస్తువులను అక్కడికక్కడే పారబోసారు. కొన్ని శాంపిల్స్ సైతం తీసుకొని వెళ్లారు.
ఇదిలా ఉంటే ఇటీవల ఓ మహిళ కొనుగోలు చేసిన ఆహారపొట్లంలో చనిపోయిన బల్లి కనిపించడంతో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన పిల్లలకు ఆ మిక్చర్ తినిపించానని ఏదో కరివేపాకులా కనిపించిందని చూస్తే ప్యాకెట్ లో చనిపోయిన బల్లి కనిపించిందని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్లు ఫుడ్ సేఫ్టీ అధికారులను ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టి అధికారులు మాల్ లో ఆహాపదార్థాలు చూసి షాక్ అయ్యారు.






