గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ..16 మంది విద్యార్థులకు అస్వస్థత

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో గురుకుల పాఠ‌శాల‌ల్లో ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ప్ర‌భుత్వం క‌ఠిన చర్య‌లు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌లు పున‌రావృతం అవుతూనే ఉన్నాయి.

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ..16 మంది విద్యార్థులకు అస్వస్థత
X

దిశ‌, వెబ్ డెస్క్: రాష్ట్రంలో గురుకుల పాఠ‌శాల‌ల్లో ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ప్ర‌భుత్వం క‌ఠిన చర్య‌లు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌లు పున‌రావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా హైద‌రాబాద్ లోని బాగ్ లింగంప‌ల్లి మైనారిటీ గురుకుల పాఠ‌శాల‌లో ఫుడ్ పాయిజ‌న్ అయింది. రాత్రి భోజ‌నం చేసిన అనంత‌రం 16 మంది విద్యార్థులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వాంతులు, విరోచ‌నాల‌తో అవ‌స్థ ప‌డ‌టంతో సిబ్బంది విద్యార్థుల‌ను కింగ్ కోఠి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్వ‌స్థ‌కు గురైన విద్యార్థులు అమ్మాయిలు, చిన్నారులు ఉన్నారు. త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అంద‌డంతో ఆస్ప‌త్రికి చేరుకుని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటివి జ‌ర‌గ‌కుండా ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Next Story