- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Planes : విమానాలకు పొగమంచు బ్రేక్ లు!
శీతకాలం నేపధ్యంలో తెల్లవారుజామున కురుస్తున్న పొగ మంచు(Fog) విమానాల రాకపోకల(Flight Arrivals)కు ప్రతికూలం(Negatively)గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో మంచు ప్రభావంతో పలు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్ : శీతకాలం నేపధ్యంలో తెల్లవారుజామున కురుస్తున్న పొగ మంచు(Fog) విమానాల రాకపోకల(Flight Arrivals)కు ప్రతికూలం(Negatively)గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో మంచు ప్రభావంతో పలు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లాల్సిన ఇండిగో విమానం(Indigo Flight) పొగ మంచు వల్ల గంట సేపు గాలిలోనే చక్కర్లు(Circles In The Air) కొట్టాల్సి వచ్చింది. తర్వాత రాజమండ్రి వెళ్లి అక్కడ ల్యాండ్ అయింది.
ఈ విమానంలో 78 మంది ప్రయాణికులు ఉన్నారు. ల్యాండింగ్ కు అనుకూలించిన తర్వాత తిరిగి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లింది. పొగమంచు నేపథ్యంలో విమానం గాలిలోనే చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడిన క్రమంలో ప్రయాణికులు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ కు గురయ్యారు. విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యాక వారంతా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అటు విజయవాడ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేయడంతో విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. రన్ వే విజిబులిటీ లే విమానాలు గాలిలో చక్కర్లు కొట్టాయి.
ఇక రోడ్డు మార్గాల్లోనూ పొగమంచు పేరుకుపోవడంతో వాహనాదారులు ఇబ్బంది పడ్డారు. లైట్లు వేసుకుని నెమ్మదిగా ఎదురుగా వచ్చే వాహనాలను జాగ్రత్తగా గమనిస్తూ వాహనాదారులు ముందుకెళ్లాల్సివచ్చింది.






