సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థపై ఫోకస్

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ లో మెరుగైన పద్దతులతో రీసైక్లింగ్..రీయూజ్ తోపాటు ఆదాయాన్ని రాబట్టుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయిలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రింకోర్టు ఆదేశించింది.

సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థపై ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ లో మెరుగైన పద్దతులతో రీసైక్లింగ్..రీయూజ్ తోపాటు ఆదాయాన్ని రాబట్టుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయిలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రింకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే.శ్రీదేవి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వ్యర్థాల శుద్ధి మరియు రీసైక్లింగ్‌లో వినూత్న సాంకేతికతలు మరియు ఉత్తమ పద్ధతులను ఉపయోగించడంతోపాటు వ్యర్థాల తగ్గింపు, పునర్వినియోగం, రీసైక్లింగ్ మరియు వనరుల పునరుద్ధరణ ద్వారా వృత్తాకార ఆర్థిక వ్యవస్థ సూత్రాలను అవలంబించేవిధంగా కమిటీ పర్యవేక్షించనుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతోపాటు మున్సిపల్ వేస్ట్ నుంచి కంపోస్టింగ్, బయో-సీఎన్‌జీ, వ్యర్థాల నుండి శక్తి, రీసైక్లింగ్ మరియు కో-ప్రాసెసింగ్‌తో సహా వ్యర్థాల నుండి వనరులను ఉత్పత్తి చేసే కార్యక్రమాలను ఈ కమిటీ గుర్తించడంతోపాటు అమలుకు చర్యలు తీసుకోనుంది. కంపోస్ట్, ఆర్‌డీఎఫ్, రీసైకిల్ చేయదగినవాటితోపాటు ఇతర పునరుద్ధరించిన పదార్థాల వంటి వ్యర్థాల నుండి ఉత్పన్నమైన ఉత్పత్తుల మార్కెట్ అభివృద్ధి, తుది వినియోగం కోసం ఈ కమిటీ చర్యలను సమీక్షించి, సిఫార్సు చేయనుంది.

స్పెషల్ సీఎస్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ…

మున్సిపల్, అర్బన్ డవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ స్పెషల్ సీఎస్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్ గా మున్సిపల్ శాఖ కమిషనర్ వ్యవహరించనున్నారు. సభ్యులుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పర్యావరణ, అటవీశాఖ ముఖ్యకార్యదర్శి, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్, మున్సిపల్ శాఖ కార్యదర్శి, టీజీపీసీబీ మెంబర్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు ఉన్నారు

Next Story