- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేబీఆర్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ పనులు షురూ! ట్రాఫిక్ మళ్లింపుల ట్రయల్ రన్
by Ramesh Naini |
జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు పార్క్ చుట్టూ వన్‌వే అమలు చేయాలని భావిస్తున్న అధికారులు.. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ నిర్వహించారు.
పంజాగుట్ట (టీవీ9 ఆఫీస్) నుంచి మాదాపూర్ వెళ్లే వాహనాలను కేబీఆర్ పార్క్ వద్ద ఎడమవైపునకు మళ్లించారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్, సీవీఆర్ జంక్షన్, బాలకృష్ణ నివాసం మీదుగా రోడ్డు నంబర్ 2 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపునకు వన్‌వేగా ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. ఈ రెండు గంటల ట్రయల్ రన్‌లో తలెత్తిన లోటుపాట్లను విశ్లేషించిన అనంతరం, ఈ మార్గంలో వన్‌వే అమలుపై ట్రాఫిక్ అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Next Story






