- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉస్మాన్ సాగర్‌కు భారీగా వరద.. 8 గేట్లు ఎత్తివేత
రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలకు జలాశయాలకు వరద పోటెత్తుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలకు జలాశయాలకు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ (Osman Sagar)కు సైతం భారీగా వరదనీరొచ్చి చేరుతుండటంతో అధికారులు 8 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ ఇన్ ఫ్లో 1100 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2700 క్యూసెక్కులుగా ఉంది. నార్సింగి - ఓఆర్ఆర్ కాజ్‌వే పైకి వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంచిరేవుల గ్రామానికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగడంతో వరదలు ఇళ్లను చుట్టుముట్టాయి. దీంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. బాసరలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఆలయ పురవీధుల్లోకి వరద నీరు చేరగా.. కాటేజీలు, లాడ్జిల్లో భక్తులు, ఆలయ సిబ్బంది చిక్కుకున్నారు. వారికి పోలీసులు, స్థానికులు ఆహారాలను పంపిణీ చేశారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.






