- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థియేటర్‌లోకి వరద నీరు.. రజినీకాంత్ సినిమా ప్రదర్శన నిలిపివేత.. ఆదిలాబాద్‌లో ఘటన
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి (Adilabad) ఆదిలాబాద్ జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదిలాబాద్ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు (Flood water) పోటెత్తింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇల్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ పట్టణంలోని (Nataraj Cinema Theater) నటరాజ్ సినిమా థియేటర్ లోనికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇటీవల విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన ‘కూలీ’ (Coolie) సినిమా మార్నింగ్ షో నిలిపివేసినట్లు స్థానికుల సమాచారం. మరోవైపు థియేటర్ నిర్వాహకులు వరద నీటిని బయటకు పంపే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.
సినిమా థియేటర్‌టలోకి వరద నీరు వచ్చిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పట్టణంలో అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీలో 16.7 సెంటీమీటర్ల వర్షపాతం గత రాత్రి నమోదు అయింది. అలాగే మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 14 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. అదేవిధంగా కడెం ప్రాజెక్టులో వరద ప్రవాహం కంటిన్యూగా ప్రవహిస్తోంది.






