- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: కనీస స్పందన లేని కాంగ్రెస్ ప్రభుత్వం – ENT ఆసుపత్రి దుస్థితిపై హరీశ్‌రావు ఫైర్
కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రోడ్లు, పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కోఠిలోని (ENT Hospital) ఈఎన్‌టీ ఆస్పత్రిలోకి భారీగా వరద నీరు (Flood water) వచ్చి చేరింది. ఆస్పత్రి ప్రాంగణంలో వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. వార్డులు, అత్యవసర విభాగంలోకి వాన నీరు చేరడంతో రోగులు, వైద్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో గత కొన్ని రోజులగా నాలా పైకప్పు కుంగి ఆసుపత్రిలోకి మురుగు నీరు వస్తున్న మరమత్తులు చేపట్టలేదని, దీంతో వరద నీరు వస్తోందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 'బ్లాక్ ఫంగస్' వంటి మహమ్మారికి సైతం అద్భుతంగా సేవలు అందించిన కోఠి ఈఎన్‌టీ (ENT)ఆసుపత్రి దుస్థితి ఇది.. అని హరీశ్ రావు వీడియో పోస్ట్ చేశారు. ఆసుపత్రి నాలా మరమ్మతులు చేయకపోవడంతో భారీగా వర్షం నీళ్లు చేరుతుందని తెలిపారు. వర్షం పడుతున్న ప్రతీసారి పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఈ ప్రభుత్వంలో కనీసం స్పందన లేదని ఫైర్ అయ్యారు. వెంటనే స్పందించి నాలా మరమ్మతు పనులు చేపట్టాలని, వరద నీరు ఆసుపత్రికి చేరకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






