- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: హోండా షోరూంలోకి వరదనీరు.. చిక్కుకున్న 80 మంది సిబ్బంది
అకాల వర్షం(Rain) హైదరాబాద్ ప్రజలను అతలాకుతలం చేసింది. ఎక్కడికక్కడ రోడ్లపైకి వర్షం నీరు చేరి ప్రయాణికులకు తీవ్ర అంతరాయం కలిగించింది.

దిశ, వెబ్‌డెస్క్: అకాల వర్షం(Rain) హైదరాబాద్ ప్రజలను అతలాకుతలం చేసింది. ఎక్కడికక్కడ రోడ్లపైకి వర్షం నీరు చేరి ప్రయాణికులకు తీవ్ర అంతరాయం కలిగించింది. ముఖ్యంగా హైదరాబాద్ - రసూల్‌పురలోని 'పైగా' కాలనీ విమాన నగర్‌లో భారీ వర్షంతో ఓ కార్ల షోరూమ్‌లోకి 4 అడుగుల మేర వరద చేరింది. దీంతో సుమారు 30 మంది కార్మికులు అందులోనే చిక్కుకున్నారు. రక్షించాలంటూ పోలీసు, డీఆర్‌ఎఫ్, హైడ్రా అధికారులకు షోరూమ్(Honda Showroom) సిబ్బంది సమాచారం అందించారు. రంగంలోకి దిగిన హైడ్రా, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. షోరూమ్ వెనుకవైపు నుంచి కార్మికులను తరలించారు. కొందరిని బోట్ల ద్వారా పోలీస్ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. హైదరాబాద్‌లో భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. వీడియో






