- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామపిశాచి.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై ఫ్లెక్సీల కలకలం
హైదరాబాద్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ప్లెక్సీలు వెలిశాయి. తెలంగాణ భవన్ సమీపంలో

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణ భవన్ సమీపంలో ఆరిజన్ డైరీ యాజమాన్యం పేరుతో ప్లెక్సీలు కనిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేపై ఈ ఫ్లెక్సీలలో సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ సార్.. అటవీ గిరిజనులకు అండగా ఉండాలని, బెల్లంపల్లి కామపిశాచి దుర్గం చిన్నయ్య, మీ పార్టీ ముసుగులో జరుగుతున్న అరాచకాలను ఆపి మహిళలకు అండగా నిలవాలని పేర్కొన్నారు. మానవ అక్రమరవాణాలో నిందితులుగా ఉన్న మీ పార్టీ నేతలను వెంటనే సస్పెండ్ చేయాలని, కఠిన శిక్షలు పడేలా చూడాలని డిమాండ్ చేశారు. అందులో కొమురంభీం జిల్లాలో మానవ అక్రమ రవాణాకు సంబంధించిన వార్తలను సైతం ముద్రించారు.
ఇదిలా ఉంటే గతంలోనూ ఆరిజన్ డైరీ పేరుతో దుర్గం చిన్నయ్యపై తెలంగాణ భవన్ ముందు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆరిజన్ డైరీని నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని నిర్వాహకులు ఆరోపించారు. అంతే కాకుండా ఆరిజన్ డైరీ ఎండీపై దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపులకు పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆనాటి నుండి దుర్గం చిన్నయ్యపై ఆరిజన్ డైరీ నిర్వాహకులు పోరాటం చేస్తూనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో డైరీ ఎండీ బయటకు వచ్చి ఆందోళన చేసినప్పటికీ బీఆర్ఎస్ చిన్నయ్యకు టికెట్ కేటాయించింది. ఎన్నికల్లో చిన్నయ్య ఓడిపోగా అక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది.






